పురుగు మందు డబ్బులతో రైతుల ఆందోళన

నకిలీ వరి విత్తనాల మూలంగా తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులు న్యాయం కోసం బాలాజీ ఫెర్టిలైజర్ ఎదుట పురుగు మందు డబ్బులతో బైఠాయించి మంగళవారం ఆందోళన నిర్వహిస్తున్నారు.

పురుగు మందు డబ్బులతో రైతుల ఆందోళన

దమ్మపేట, మన సాక్షి :

నకిలీ వరి విత్తనాల మూలంగా తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులు న్యాయం కోసం బాలాజీ ఫెర్టిలైజర్ ఎదుట పురుగు మందు డబ్బులతో బైఠాయించి మంగళవారం ఆందోళన నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయ గిరిజన రైతులు యాసంగి వరి సాగుకోసం ములకలపల్లి కి చెందిన బాలాజీ ఫెర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్స్ లో వరి విత్తనాలు కొనుగోలు చేసి నాటు వేశారు. వయసు రాకముందే వరి ఈనింది. పొలం అంతా తాలు కంకులు ఉన్నాయి.