Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడ్డాయి.. చెక్ చేసుకోండి.. లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడ్డాయి.. చెక్ చేసుకోండి.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ రైతాంగానికి రేవంత్ సర్కార్ భారీ శుభవార్త తెలియజేసింది. సోమవారం రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు నేస్తం వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్‌లైన్ మీట నొక్కి రైతుల బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేశారు. తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
సోమవారం ఆయన రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల ద్వారా నిర్వహించిన “రైతు నేస్తం” కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులను రాజుగా చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేయడంలో భాగంగా రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.

రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగానే రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చి వాణిజ్య పంటలు పంటలు పండించే విధంగా ప్రోత్సహించాలని, ముఖ్యంగా సోలార్ ద్వారా పంపుసెట్లు నిర్వహించుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను వేదిక నుండి ఆదేశించారు.
రైతు వేదికలలో అనుభవజ్ఞుల ద్వారా తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులు సాధించే విధంగా, నూతన సాంకేతికత పై రైతులకు అవగాహన కల్పించాలని, అవసరమైతే నిష్ణాతుల ద్వారా రైతు వేదికల ద్వారా తెలియజేసేందుకు గౌరవ వేతనం కూడా ఇవ్వాలని, సోలార్ పంప్ సెట్ల ప్రయోజనం, భూసారం ఆధారంగా ఏ పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయో తెలియజేయాలని, ముఖ్యంగా ఉద్యాన, పండ్లతోటల పండించే విధంగా ప్రోత్సహించాలని, పంట మార్పిడి చేయాలని ,రైతుల ఆలోచనలో చైతన్యం తీసుకొచ్చే విధంగా చూడాలని చెప్పారు.

గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలలో కేవలం 16 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేస్తే ,తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎవరూ చేయని విధంగా కేవలం 4 నెలల్లో 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని తెలిపారు. సన్న వడ్లు పండించిన రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడమే కాకుండా, 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేశామని,ఈ సంవత్సరం రెండు కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు.
గత ప్రభుత్వం గ్రామపంచాయతీ బిల్లుల పెండింగ్ల్లో ఉంచిందని, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చేయలేదని, 8 లక్షల 29 వేల కోట్ల రూపాయలు అప్పులను మిగిల్చి తమకు అప్పగించగా, ఒక్కో వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్తున్నామని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ తోపాటు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తున్నామని,
అలాగే అప్పులు చెల్లిస్తున్నామని 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, వ్యవసాయం పై లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, సివిల్ సర్వీస్ చదువులు చదివే వారికి రాజీవ్ గాంధీ స్కాలర్షిప్ కింద రెండు లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్ మాట్లాడారు.
MOST READ :
-
District collector : ప్రజావాణకి ఫిర్యాదుల వెళ్ళవ.. సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం.!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఆసుపత్రుల పర్యవేక్షణకు త్వరలో యాప్..!
-
District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. రైతు నేస్తం వీక్షించాలి..!
-
Manchu Lakshmi : దేవుడి దయవల్ల విమాన ప్రమాదం నుంచి బయటపడ్డా.. మంచులక్ష్మి వీడియో..!
-
New Creature : పాక్షిక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలిన కొత్త జీవి..!









