Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!
తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. యాసంగి పంటల సీజన్ ముగిసినప్పటికీ రైతు భరోసా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. యాసంగి పంటల సీజన్ ముగిసినప్పటికీ రైతు భరోసా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతి పండుగకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తారని భావించినప్పటికీ ఆలస్యమైంది. అయితే రైతు భరోసా నిధులు వృధా కాకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
కేవలం పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందజేయాలని నిర్ణయించింది. అందుకుగాను శాటిలైట్ సర్వే ఆధారంగా యాసంగి సీజన్ లో రైతు భరోసా నిధులు అందజేయాలని నిర్ణయించింది. కాగా ఇటీవల శాటిలైట్ సర్వే ను ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పూర్తి చేశారు. ఈ నెల 6వ తేదీన ప్రభుత్వానికి సర్వే నివేదికను అందజేయనున్నారు. దాంతో రైతు భరోసా అందజేసేందుకు లైన్ క్లియర్ అయింది అని చెప్పవచ్చును.
యాసంగి సీజన్ రైతులకు ఒక్కొక్క ఎకరానికి 6000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో నేరుగా జమ చేయనున్నారు. ఇదిలా ఉండగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ బహిరంగ సభలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. రైతుల ఖాతాలలో నేరుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలను తొమ్మిది రోజుల్లో గతంలో మాదిరిగానే జమ చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి తాజా ప్రకటనతో మున్సిపల్ ఎన్నికలు వరకు.. అంటే ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆగాల్సిందే.
MOST READ
-
Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడే బోణీ.. కాంగ్రెస్ జోష్..!
-
Gold Price : బంగారం ధరలో ఊహించని మార్పు.. ఈరోజు తులం ఎంతంటే..!
-
తెలుగు రాష్ట్రాలను కంటతడి పెట్టిస్తున్న కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముంది..!
-
Miryalaguda : మాజీ ఎమ్మెల్యే భాస్కరరావుకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!









