TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

తెలంగాణలో రైతాంగం యాసంగి రైతు భరోసా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతాంగం యాసంగి రైతు భరోసా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ లో ముందుగానే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసిన ప్రభుత్వం యాసంగి సీజన్ సగం పూర్తయినా.. ఇప్పటి వరకు రైతు భరోసా కు అతీ గతీ లేదు. సీజన్ ప్రారంభంలోనే రైతులకు రైతు భరోసా అందజేస్తే పెట్టుబడి సహాయంగా ఉండేది. కానీ సంక్రాంతి పండుగకు రైతు భరోసా అందజేస్తామని పేర్కొన్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టత ఇంకా రాలేదు.

రైతు భరోసా పథకంలో యాసంగి సీజన్ నుంచి మార్పులు చేర్పులు చేశారు. నిజమైన రైతులు, సాగు చేసిన పంటలకే రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందుకు గాను శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అందించేందుకు సిద్ధమైంది. సాగు చేయని భూములు కొండలు, గుట్టలు ఇతర భూములకు రైతు భరోసా కట్ చేయనున్నారు. ప్రస్తుతం సాగుచేసిన భూములలో శాటిలైట్ సర్వే అధికార యంత్రం చేపడుతుంది. సర్వే పూర్తయిన తర్వాతనే రైతులకు రైతు భరోసా అందించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందే అవకాశాలు ఉన్నాయి.

గత ప్రభుత్వంలో :

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి రెండు విడతలుగా పదివేల రూపాయలను అందించేవారు. రైతు బంధు పథకం ద్వారా సీజన్ ప్రారంభంలోనే రైతులకు ఖాతాలలో డబ్బులు పడేవి. దాంతో రైతులకు పెట్టుబడి సహాయంగా ఎంతో ఉపశమనం కలిగేది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి 15వేల రూపాయలను రెండు విడుతలగా అందజేస్తామని ప్రకటించినప్పటికీ 12 వేల రూపాయలనే అందజేస్తున్నారు. అదీ కూడా సీజన్ ప్రారంభంలో ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఆలస్యం పై ఆందోళన :

రైతుబంధు పథకం వర్తింప చేయడానికి ప్రభుత్వం నూతన నిబంధనలు తీసుకొచ్చింది. శాటిలైట్ ఆధారంగా రైతు భరోసా నిధులు అందజేసేందుకు సిద్ధమైంది. కానీ అధికార యంత్రాంగం శాటిలైట్ సర్వే ఆలస్యం కావడంతో రైతులకు రైతు భరోసా అందించలేక పోతున్నారు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నూతన నిబంధన తీసుకొచ్చిన వెంటనే శాటిలైట్ సర్వే కూడా వేగవంతంగా చేపట్టి రైతులకు పంటల సీజన్ ప్రారంభం కాగానే రైతు భరోసా నిధులు అందజేస్తే రైతులకు ఎంతో మేలు చేకూరేది. కానీ సీజన్ పూర్తయ్యే వరకు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రైతు భరోసా యాసంగి సీజన్ కు ఇస్తారా..? ఇవ్వరా..? అనే విషయం ఆందోళన కలిగిస్తుంది.

MOST READ 

  1. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  2. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  3. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

మరిన్ని వార్తలు