TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Rythu Bharosa : రైతు భరోసా.. వారు అలా.. వీరు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా.. వారు అలా.. వీరు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం జనవరి 26వ తేదీన ప్రారంభించింది. ఈ పథకాన్ని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలలో మండలానికి ఓ గ్రామం ఎంపిక చేసి ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభమైన గ్రామాల రైతులకు వెంటనే వారి వారి బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా డబ్బులు వేశారు.

మార్చి 31వ తేదీ లోపు అర్హులందరికీ రైతు భరోసా పథకాన్ని విడుతల వారీగా అందజేస్తామని పేర్కొన్నది. దాంతో పాటు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు భరోసా అందజేయనున్నట్లు పేర్కొన్నది. కాగా అయినప్పటికీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి.

అదేంటంటే ప్రభుత్వం చేపట్టే రైతు భరోసా పథకం పొందిన రైతులు ఆనందంలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఒక్కరోజే రైతు భరోసా వచ్చింది. మరి ఏది అంటూ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఆయా పార్టీల వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.


-MOSTREAD :

  1. Rythu Bharosa : రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు.. చెక్ చేసుకోండి.. బిగ్ అప్డేట్..!

  2. Nalgonda : వీళ్లు మామూలోళ్ళు కాదు.. పార్కింగ్ చేసిన లారీలు కనిపిస్తే మాయం..! 

  3. Rythu : యూరియా కోసం రైతుల కష్టాలు.. క్యూ లైన్ లో చెప్పులు పెట్టిన రైతులు..!

  4. Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్నకు బెయిల్..!

మరిన్ని వార్తలు