మిర్యాలగూడ : విద్యుత్ షాక్ తో రైతు మృతి

మిర్యాలగూడ : విద్యుత్ షాక్ తో రైతు మృతి

మిర్యాలగూడ, మన సాక్షి :

విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం లో చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన వంగాల అనిల్‌రెడ్డి (32) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆదివారం మధ్యాహ్నం తన భార్యతో కలిసి భావి వద్ద వ్యవసాయ మోటర్లు ఆన్ చేసినందుకు వెళ్ళాడు. కరెంటు రాకపోవడంతో వైర్లు సరి చేస్తుండగా కుడి చేతికి కరెంట్ షాక్ తగిలి కిందపడి చనిపోయాడు. వెంటనే ఉన్న భార్య కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు వచ్చి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ALSO READ : కేటీఆర్ తో మిర్యాలగూడ జిల్లా ప్రకటన చేయించాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు..!

అప్పటికే అతను చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని అనిల్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ALSO READ : మిర్యాలగూడలో 10న కేటీఆర్ పర్యటన.. అధికారులతో ఎమ్మెల్యే కీలక సమావేశం..!