Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

TG News : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్..!

TG News : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్..!

హైదరాబాద్, మన సాక్షి ;

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కొద్దిసేపు సమావేశమయ్యారు.

సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా, యాదవులు ఘనంగా జరుపుకునే సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ అభినందించారు.

ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా యాదవ సమాజం ముఖ్యమంత్రిని గుర్తుంచుకుంటుందని పేర్కొంటూ, యాదవులకు ఇచ్చిన ప్రాధాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు