ముగ్గుల పోటీ ప్రారంభం

ముగ్గుల పోటీ ప్రారంభం

హుజూర్నగర్, మనసాక్షి:

హుజూర్నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హైస్కూల్ లో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ లను ప్రారంభించడం జరిగింది

ఈ సందర్బంగా సైదిరెడ్డి మాట్లాడుతూ… ముగ్గుల పోటీని నిర్వహిస్తున్న వాసవి క్లబ్ వారికీ అభినందనలు తెలియజేస్తూ..పాల్గొనడానికి విచ్చేసిన అక్క చెల్లి లకు , న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన టీచర్లు షర్మిలమేడం టీంకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు..

మహిళలు ముగ్గులవేయడంలో ఎన్నో సైన్స్ అంశాలతో పాటు సంప్రదాయము కూడా ఉంది అని..ప్రతి రోజు అందమైన ముగ్గును ఇండ్ల ముందు తీర్చి దిద్దడంతోనే మానసికంగా పోసిటివ్ వైబ్రేషన్స్ తో ప్రతి రోజు ను ఉత్సహంగా మొదలు పెడుతుంటారని..మహిళలు మానవ నాగరికత లో ప్రముఖ పాత్రను పోషించారని తెలియజేస్తూ… ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్న ప్రతి మహిళ ఒక విజేతనే అని తెలియజేసారు

అనంతరం వాసవి క్లబ్ కమిటీ వారు గౌరవ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని పులమాలలతో.. శాలువా తో సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో….

*వాసవి క్లబ్ కమిటీ వారు.మరియు భారీగా మహిళలు..ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు*