తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్

Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!

Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల పదవీకాలం ముగిసి సుమారు ఏడు మాసాలు గడుస్తుంది. రాష్ట్ర ప్రజలు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. 2024 జనవరి మాసంతో సర్పంచుల పదవీకాలం ముగిసింది.

దాంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామాలకు స్పెషల్ అధికారులను నియమించారు. నాటి నుంచి స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతుంది. కాగా గ్రామపంచాయతీ సర్పంచ్ లకు గడువు ముగిసిన ఆరు మాసాలలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాండ్స్ ఆగిపోయే అవకాశం కూడా ఉంది.

దాంతో సాధ్యమైనంత వరకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. వివిధ కారణాలవల్ల ఆరుమాసాలలోపు ఎన్నికలు నిర్వహించలేకపోయింది. కాగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది.

గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీసీ కమిషన్, చైర్మన్, సభ్యులను నియమించిన తర్వాత వాటి ద్వారా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తామని చెప్పారు.

బీసీ రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాతనే గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల తర్వాతనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజుల క్రితమే జారీచేసింది. దాని ఆధారంగా త్వరలో జరగబోయే ఎన్నికలకు ఓటర్ల జాబితాను సిద్ధం చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

LATEST UPDATE : 

Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!

Mlc Kavitha : ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత.. 10 రోజులపాటు అక్కడే..!

Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!

Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు