సేవ్ కాంగ్రెస్ పేరుతో కీలక సమావేశం

సేవ్ కాంగ్రెస్ పేరుతో కీలక సమావేశం

సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో ముగిసిన కాంగ్రెస్ సీనియర్ నేతల కీలక భేటీ*

హైదరాబాద్,  మన సాక్షి:

*పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీరుపై బాహాటంగా మొదటి నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

*భేటి కి హాజరైన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కొదండ రెడ్డీ, ఫోన్లో మాట్లాడిన మాజీ మంత్రి గీతారెడ్డి, మండలి విపక్ష నేత జీవన్ రెడ్డీ*

*సేవ్ కాంగ్రెస్ పేరుతో జరిగిన కీలక సమావేశం*

*భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేతలు*

*తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులపై కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు*

*భట్టి నివాసంలో ఉదయం నుంచి ఐదు గంటలపాటు చర్చించిన నాయకులు తమపై పార్టీలో, సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని తిప్పి కొట్టారు*

*నాలుగైదు పార్టీలు మారి కాంగ్రెస్ లోకి వచ్చిన వలస నేతలు, అసలు కాంగ్రెస్ నేతల రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు*

*ఓర్జినల్ కాంగ్రెస్ నేతలైన తమను పట్టుకుని,తమను కొవర్టూలుఅంటూ కొందరు నేతలు తమ సొంత సోషల్ మీడియాలో లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు*

*పార్టీ మీడియా ఆఫీస్ లో కూడా సొంత పార్టీ నేతలపై నెగెటివ్ ప్రచారం చేసున్న ప్రయత్నం దుర్మార్గం అన్నారు*

*కొన్ని అంశాలపై పార్టీలో జరుగుతున్న వివాదం సీనియర్లు, జూనియర్ల మధ్య కాదు, పార్టీ లోకి వలస వచ్చిన నేతలకు, అసలు కాంగ్రెస్ నేతలకు మధ్య పంచాది*

*ఇటీవల వేసిన టీపీసీసీ కమిటీలలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు పెద్ద పీట వేశారు, పార్టీ లో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న నాయకులకు అన్యాయం చేశారు*

*పార్టీ లో జరుగుతున్న అన్ని విషయాలను అధిష్ఠానానికి వివరిస్తాం, త్వరలోనే డిల్లీ వెళ్తాం*