Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BIGBREAKING: మిర్యాలగూడలో సంచలనం.. మృతదేహాన్ని వెలికి తీసి రీపోస్టుమార్టం..!

BIGBREAKING: మిర్యాలగూడలో సంచలనం.. మృతదేహాన్ని వెలికి తీసి రీపోస్టుమార్టం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఐదు రోజుల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని అధికారుల సమక్షంలో వెలికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటన మిర్యాలగూడలో సంచలనం కలిగించింది. రూరల్ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..

మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం గ్రామానికి చెందిన శివనేని అరుణ (43) గత సంవత్సరం న్నర నుంచి మండలంలోని యాద్గార్ పల్లి శివారులో ఉన్న ఎస్ ఎం ఎస్ 9 ఆగ్రో ఆయిల్ మిల్లులో పనిచేస్తుంది. ఈ ఏడాది మే 31వ తేదీన ఆమె పనిచేస్తున్న మిల్లు వద్ద అస్వస్థతకు గురైంది. దాంతో ఆమెని మిర్యాలగూడ, నల్లగొండ ఆస్పత్రులతోపాటు గాంధీ ఆసుపత్రికి కూడా తరలించారు.

కానీ ఈనెల 25వ తేదీన మృతి చెందింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ మృతురాలి కుమారుడు ఈనెల 29వ తేదీన తన తల్లి ఆస్వస్థతకు గురికాగా మిల్లు వాళ్ళు సరైన వైద్యం అందించకపోవడం వల్లనే శ్వాస సమస్యతో ఆమె చనిపోయిందని ఫిర్యాదు చేశాడు. దాంతో తహసిల్దార్ హరిబాబు సమక్షంలో పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించి ప్రభుత్వ వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు.

ALSO READ : 

BREAKING: తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ధరణి ఫైళ్ల తనిఖీ..! 

BREAKING: నల్గొండ జిల్లాలో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు.. కేసులు నమోదు..!

T20 world Cup 2024 : టి20 వరల్డ్ కప్ లో డబ్బే.. డబ్బు.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్..!

మరిన్ని వార్తలు