సెస్ డైరెక్టర్ కు  నామినేషన్లు

సెస్ డైరెక్టర్ కు  నామినేషన్లు

రుద్రంగి, డిసెంబర్ 14 (మనసాక్షి) : సెస్ ఎన్నికలలో భాగంగా బుధవారం రుద్రంగి మండలకేంద్రం నుండి సెస్ డైరెక్టర్ స్థానాలకు పలువురు నామినేషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆలూరి సంతోష్ రెడ్డి నామినేషన్ వేయగా. స్వతంత్ర అభ్యర్థిగా అల్లాడి కృష్ణ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం బిజెపి అభ్యర్థి గా పడాల గణేష్ నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆకుల గంగారాం ఎన్నికల బరిలో ఉంటారని వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు పేర్కొన్నారు.