ఇరుముడితో శబరి కి బయలుదేరిన అయ్యప్ప స్వాములు

చింతపల్లి మండలం పరిధిలోని మాల్ వెంకటేశ్వర్ నగర్ గోడ కొండ గ్రామానికి చెందిన వేద పండితులు వైద్యుల ప్రవీణ్ శర్మ తో పాటు మరో 10 మంది సోమవారం శబరి కొండపై ఇరుముడులు కట్టుకొని స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు.

ఇరుముడితో శబరి కి బయలుదేరిన అయ్యప్ప స్వాములు

చింతపల్లి, మనసాక్షి :

చింతపల్లి మండలం పరిధిలోని మాల్ వెంకటేశ్వర్ నగర్ గోడ కొండ గ్రామానికి చెందిన వేద పండితులు వైద్యుల ప్రవీణ్ శర్మ తో పాటు మరో 10 మంది సోమవారం శబరి కొండపై ఇరుముడులు కట్టుకొని స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా శబరి కొండపై స్వామివారికి మల్లు జగత య గురుస్వామి, మట్ట యాదయ్య గురుస్వామి, వైద్యుల ప్రవీణ్ శర్మ గురు స్వామి, బాస లక్ష్మణ్ గురు స్వామి, స్వామి సన్నిధిలో ఉదయం 5 గంటలకు అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.

అనంతరం 41 రోజులు దీక్ష చేసిన స్వాములు శబరి కొండపై ఇరుముడులు కట్టుకొని శబరి యాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాధారణ భక్తులు, ఇరుముడులు కట్టుకున్న అయ్యప్ప స్వాముల బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ : రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్.. కేవైసీ గడవు పెంచిన ప్రభుత్వం..!