శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ గా బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

శంకర్‌పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ గా బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 28: (మన సాక్షి):

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా.. వైస్ ఎంపీపీ, టంగుటూరి ఎంపిటిసి ఇద్దరు మరణించగా, 11మంది ఎంపిటిసి లు ప్రస్తుతం ఉన్నారు. ఎన్నికకు తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. కొత్తపల్లి, కొండకల్ ఎంపిటిసి సభ్యులు ఇద్దరు హాజరు కాలేదు. మహాలింగాపురం ఎంపీటీసీ యాదగిరి వైస్ ఎంపీపీగా ప్రొద్దుటూరు గ్రామ ఎంపీటీసీ ప్రవళిక వెంకట్ రెడ్డిని ప్రతిపాదించారు.

పర్వేద ఎంపీటీసీ వెంకట్ రెడ్డి వైస్ ఎంపీపీ గా ప్రవళికను బలపరిచారు. చేవెళ్ల డిఎల్ పిఓ సతీష్ చేతుల మీదుగా వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

వైస్ ఎంపీపీ ప్రవళికను జెడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీటీసీలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డికి మండల, మున్సిపల్ బిఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యుడు, ఎండిఓ వెంకయ్య గౌడ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ALSO READ : Inter Exams : నిమిషం ఆలస్యం.. పరీక్షకు అనుమతించని అధికారులు, గేటు బయట ముగ్గురు ఇంటర్ విద్యార్థులు..!