రాత్రికి రాత్రే శివాజీ విగ్రహం తొలగింపు

రాత్రికి రాత్రే శివాజీ విగ్రహం తొలగింపు

ఆగ్రహం వ్యక్తం చేసిన మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు

మహేశ్వరం , మన సాక్షి :

హిందూత్వ భావాలకు, ఛత్రపతి శివాజీ వారసులకు మంత్రి సబితమ్మ వ్యతిరేకమని
మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు..హస్తినాపురంలో శివాజీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించటంపై మండిపడ్డారు. శివాజీ విగ్రహాన్ని అవమానపర్చిన తొలగించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు.

 

హిందూ బంధువుల ఆరాధ్యదైవం శివాజీ మహరాజ్ విగ్రహం, కాషాయ జెండాలు చూస్తే మంత్రి సబితమ్మకు కంటగింపుగా మారిందని ఆరోపించారు. శివాజీ జయంతి సందర్భంగా ర్యాలీ తీస్తుంటే విద్యుత్తు నిలివేయటం, విగ్రహాలు తొలగించటం బీఆర్ఎస్ విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డికే చెల్లుబాటు అయిందని అన్నారు.

తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని అందెల శ్రీరాములు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ సహా రంగారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు.