శోభనం రోజు రాత్రే వధూవరుల మృతి.. మిస్టరీ..?

శోభనం రోజు రాత్రే వధూవరుల మృతి.. మిస్టరీ..?

మనసాక్షి, వెబ్ డెస్క్:

శోభనం రోజు యువజంట కన్ను మూసింది. వధూవరులకు ఇద్దరికి ఒకేసారి గుండెపోటు రావడంతో తెల్లారేసరికి మిగతా జీవులుగా మారారు . పెళ్లయిన రెండు రోజులకే కొత్త జంట కన్ను మూయడంతో తీవ్ర విషాదం నెలకొన్నది.

 

ఉత్తరప్రదేశ్ లోని బహ్ర ఇచ్ లోని గోధియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ప్రతాప్ యాదవ్ (24) , పుష్ప (22) మే 30వ తేదీన వివాహం జరిగింది. బారాత్ జరిగిన తర్వాత పెళ్ళికొడుకు ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు.

 

కొత్తజంట రాత్రి శోభనం గదిలోకి వెళ్లారు. మర్నాడు ఎంతకూ బయటకు రాలేదు. ఎంత పిలిచిన రాలేదు. బంధువులు తలుపులు పగలగొట్టి చూడగా బెడ్ పైన ప్రతాప్, పుష్పలు మృతి చెంది ఉన్నారు.

 

వెంటనే పోలీసులకు వారు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి మృతిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. శరీరంలో నుంచి నమూనాలను సేకరించి లక్నోలోని ఫోరెన్ సిక్ సైన్స్ లాబరేటరీ కి పంపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇద్దరికీ గుండెపోటు వచ్చిందా..?

కొత్త జంట శోభనం గదిలోకి వెళ్లి మృతి చెందడంపై సంచలనం కలిగింది. శోభనం గదిలో వెంటిలేషన్ లేకపోవడం గాలి ఆడక ప్రతాప్, పుష్ప కార్డియాక్ అరెస్టుతో గురై చనిపోయి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. నూతన జంట పెళ్లి వేడుకలో అలసిపోయి ఉండటం అదే సమయంలో వారికి శోభనం ఏర్పాటు చేశారని పలువురు పేర్కొంటున్నారు.

 

శోభనం గదిలోకి ఇతరులు ఎవరు వెళ్లినట్లు ఆనవాళ్లు లేవని , వారిపై ఎలాంటి దాడి జరిగినట్లు కూడా పోస్టు మార్టం రిపోర్టులో లేదు. మిస్టరీగా వధూవరుల మరణం మారింది. పెళ్లి వేడుకలు జరిగిన ప్రతి సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.