మిర్యాలగూడ : శోభారాణికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో

మిర్యాలగూడ : శోభారాణికి న్యాయం చేయాలంటూ రాస్తారోకో
మిర్యాలగూడ, మన సాక్షి
మిర్యాలగూడ పట్టణంలోని సుందర్ నగర్ కు చెందిన శోభారాణి మే 27వ తేదీన అద్దంకి – నార్కట్ పల్లి రహదారి వెంట ఉన్న అపార్ట్మెంట్ పైనుంచి పడి మృతి చెందింది.
ఈ విషయంపై పోలీసులు న్యాయం చేయాలి అంటూ ఆమె తల్లి ,బంధువులు రాస్తారోకో నిర్వహించారు.
కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై మహిళలు, బంధువులు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. శోభారాణి మృతికి కారకులైన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
శోభారానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. వారిని పోలీసులు వారించే ప్రయత్నం చేస్తున్నారు.