కంగ్టి : షార్ట్‌ సర్క్యూట్‌ తో ఆస్తి నష్టం

కంగ్టి : షార్ట్‌ సర్క్యూట్‌ తో ఆస్తి నష్టం

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దెగులవాడి గ్రామంలో శనివారం రాత్రి కరెంట్‌ షాక్‌ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయవ్వ మొగులప్ప వీరు నివాసం ఉంటున్న ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించిమంటలు చెలరేగాయి.

 

Also Read : TSPSC : తెలంగాణ గ్రూప్ – 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న.. సోషల్ మీడియాలో వైరల్ .. అది ఏంటంటే..?

 

ఇంట్లోని దుస్తులు, వంట సామార్రి , నిత్యవసర సరుకులు, రూ.40 వేల నగదు మంటలు కాలి బూడిద అయినట్లు బాధితురాలు సాయవ్వ తెలిపారు.

 

స్థానికుల సహాయంతో మంటల్లో ఆర్పినట్లు తెలిపారు. మొత్తం ఒక లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వ పరంగా తమను ఆదుకొని ఆర్థిక సాయం అందజేయాలని ఆమె కోరింది.

 

Also Read : RBI : పర్సనల్ లోన్స్.. క్రెడిట్ కార్డు పై.. ఆర్బిఐ కొత్త నిబంధనలు..!

 

జరిగిన సంఘటనను సంబంధిత అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరారు.