Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

RBI : పర్సనల్ లోన్స్.. క్రెడిట్ కార్డు పై.. ఆర్బిఐ కొత్త నిబంధనలు..!

RBI : పర్సనల్ లోన్స్.. క్రెడిట్ కార్డు పై.. ఆర్బిఐ కొత్త నిబంధనలు..!

మనసాక్షి, వెబ్ డెస్క్ :

బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకునే విషయంపై ఆర్బిఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పర్సనల్ లోన్స్ వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య 2023 తర్వాత భారీగా పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా రాబోయే కాలంలో డిఫాల్ట ర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్బీఐ గ్రహించింది. దాని కారణంగా కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.

 

కరోన తర్వాత సామాన్య ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల వైపు మొగ్గు చూపారు. అవి ఈజీగా మంజూరు కావడం వల్ల చాలామంది వ్యక్తిగత రుణాలు క్రెడిట్ కార్డులు తీసుకున్నారు.  2022 తర్వాత వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారి సంఖ్య 7.8 కోట్ల నుంచి 9.9 కోట్ల పెరిగింది.

 

క్రెడిట్ కార్డులు ఉపయోగించి రుణాలు పొందిన వారి సంఖ్య 1.3 లక్షల కోట్ల నుంచి 1.7 లక్షల కోట్లకు పెరిగింది. కాగా డిఫాల్టర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్బిఐ గ్రహించి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.

 

ALSO READ : 

  1. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!
  2. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
  3. PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!

 

ఆర్బిఐ కొత్త నిబంధనలు :

పర్సనల్ లోన్ , క్రెడిట్ కార్డులు తీసుకోవడానికి ఆర్బిఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గతంలో పర్సనల్ లోన్ కు గాని క్రెడిట్ కార్డులకు గాని ఎలాంటి గ్యారెంటీ (షూరిటీ) అవసరం లేదు. కానీ డిఫాల్టర్ల సంఖ్య వేగంగా పెరగడంతో ఖాతాదారుల నుంచి బ్యాంకులు భారీగా నష్టపోయాయి.

 

అందుకే కొత్త నిబంధనల ప్రకారం పర్సనల్ రుణాలు మంజూరు చేయడంతో పాటు క్రెడిట్ కార్డు ఇచ్చే ముందు ఆర్థిక స్థితిగతులను చెక్ చేయాలని తెలియజేసింది. ఆర్థిక స్థితిగతులతోపాటు గ్యారంటీ ( షూరిటీ) అవసరమని తెలియజేసింది. దీనివల్ల డిఫాల్టర్ల సంఖ్య తగ్గొచ్చని సూచించింది. కానీ ఇకపై పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు పొందడం సామాన్యులకు కష్టంగా మారనున్నది.

మరిన్ని వార్తలు