షూటింగ్ రాష్ట్ర జట్టు కెప్టెన్ గా సూర్యాపేట జిల్లా విద్యార్ధిని

షూటింగ్ రాష్ట్ర జట్టు కెప్టెన్ గా సూర్యాపేట జిల్లా విద్యార్ధిని
అనంతగిరి, సెప్టెంబర్ 1: మనసాక్షి : సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియల గ్రామానికి చెందిన క్రీడాకారిణి గార్లపాటి శిరీష జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది. ఆమె ఎంపికైనట్లు గొండ్రియాల ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు గంధం రంగారావు తెలిపారు. గత నెల 22న వరంగల్ జిల్లా తొర్రూరులో జరిగిన పోటీల్లో శిరీష రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 3 నుండి 5వ తేదీ వరకు బీహార్ రాష్ట్రం బుద్ధగయాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో శిరీష ప్రాతినిధ్యం వహించనున్నారు.
ALSO READ : ఉప ఎన్నికలు అంటేనే బిజెపికి వణుకు – మంత్రి జగదీశ్వర్ రెడ్డి
ఈ సందర్భంగా పిఈటి గంధం రంగారావు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాటు రాష్ట్ర జట్టుకు కెప్టెన్ కావడం ఎంతో గర్వకారణం అన్నారు. క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా శిరీషను పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరికిషన్, ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తదితరులు అభినందించారు.