TG News : సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి.. ఏంటి ఈ వ్యాధి.. ఎవరికి వస్తుంది.. అవగాహణ..!
TG News : సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి.. ఏంటి ఈ వ్యాధి.. ఎవరికి వస్తుంది.. అవగాహణ..!
దంతాలపల్లి, మన సాక్షి :
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వైద్యాధికారులు డాక్టర్ చైతన్య, డాక్టర్ కవిత ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2047 సంవత్సరం నాటికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ ప్రకటించిందని, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
దీనివల్ల ఒక్కోసారి ప్రాణంతకం కావచ్చు అని,గుండ్రంగా ఉండే ఎర్ర రక్త కణాలు సికిల్ సెల్ ఎనీమియా వల్ల కొడవలి ఆకారంలో మారి రోగికి అతి నీరసం, కాళ్లవాపు, నీరు చేరడం వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని, వీటిని గుర్తించిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య సేవలను పొందాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ కి కూడా సైకిల్ సెల్ ఎనీమియా పరీక్ష చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.
గర్భిణీకి ఈ వ్యాధి ఉన్నట్లయితే పుట్టబోయే బిడ్డకు రాకుండా కాపాడవచ్చు అన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు వాణి, అనూష, సూపర్వైజర్లు సుజాత, బీమా నాయక్, హెల్త్ అసిస్టెంట్లు మిట్టకోల సత్యనారాయణ, శ్రీనివాస్, అంజలి, వెంకటేశ్వర్లు, అన్వేష్, ఏఎన్ఎంలు కళావతి,విజయ, నిర్మల, ప్రసన్న, ఈవా, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Hyderabad : హైదరాబాద్‌లో డెలివరీ సేవలను ప్రారంభించిన షిప్‌రాకెట్..!
-
District collector : అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!
-
Aeroplane: విమానంలో తీసుకెళ్లే నగదుకి పరిమితులున్నాయా.. ఏవి తీసుకెళ్లొద్దో తెలుసుకుందాం..!
-
Rythu Bharosa : రైతు భరోసా, ఆత్మీయ భరోసా అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే.. బిగ్ అప్డేట్..!
-
Hyderabad : హైదరాబాద్ లో దారుణం.. కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారయత్నం..!









