Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

District collector : అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అంబలి ఏర్పాటు చేయడం పట్ల రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి కి వచ్చే ప్రజలు, కలెక్టరేట్ సిబ్బంది మిగతా వాళ్ళు అందరూ వేసవిలో చల్లదనానికి అంబలి తాగాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో జయసుధ, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కె. సుదర్శన్ రెడ్డి, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ఆత్మారాం ఏడ్కే, డాక్టర్ నరసింహారావు సగరి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా, ఆత్మీయ భరోసా అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే.. బిగ్ అప్డేట్..!

  2. TG News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రామ పాలన అధికారి పోస్టుల మంజూరుకు ఉత్తర్వులు జారీ..!

  3. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

మరిన్ని వార్తలు