TOP STORIESBreaking Newsజాతీయం

Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!

Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఈ మధ్యకాలంలో ఫోన్ దొంగలు ఎక్కువయ్యారు. వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు వేసిన ఫోన్లను దొంగలు ఎత్తుకెళ్లి ఎంతకో కొంతకు విక్రయించుకుంటున్నారు. పోలీసులు కొత్త యాప్ ద్వారా దొంగిలించిన సెల్ ఫోన్లు పట్టుకుంటున్నప్పటికీ చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మన సెల్ ఫోన్ లో చిన్న సెట్టింగ్స్ మార్చుకుంటే చోరీ చేసిన దొంగ.. మన ఫోను స్విచ్ ఆఫ్ కూడా చేయలేడు. ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయకుండా పరిగెత్తినా.. వెంటనే తెలుస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం..

సెల్ ఫోన్ లో సరైన సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోకపోవడం వలన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంటే పవర్ బాటన్ నొక్కితే సరిపోతుంది. కానీ సెట్టింగ్స్ చేసుకుంటే స్విచ్ ఆఫ్ చేయాలన్నా పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఆప్షన్ లోకి మనం వెళ్తే మన ఫోన్ దొంగిలించినా స్విచ్ ఆఫ్ చేయలేడు. ఈ ఆప్షన్ ప్రతి ఫోన్ లో ఉంటుంది. అది ఎలా చేయాలంటే..

మీ ఫోన్ లోని సెట్టింగ్స్ (settings) ఓపెన్ చేయండి. అందులో గూగుల్ (Google) పై క్లిక్ చేయండి. ఆల్ సర్వీసెస్ సెలెక్ట్ చేసి థెప్ట్ ప్రొడక్షన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే రెండు ఆప్షన్స్ ని ఆన్ లో ఉంచుకోండి.

వాటిలో ఒక ఆప్షన్ ఏంటంటే.. ఫోన్ పట్టుకొని పరిగెడుతుంటే ఆటోమేటిక్ గా స్క్రీన్ లాక్ అయిపోతుంది. రెండో ఆప్షన్ ఏంటంటే.. మీరు ఆఫ్ లైన్ లోకి వెళ్ళగానే ఫోన్ లాక్ అయిపోతుంది.

ఆ తర్వాత సెట్టింగ్స్ లో సెర్చ్ ఆప్షన్ లో అన్ లాక్ టు పవర్ ఆఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు కనిపించే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుంటే పవర్ ఆఫ్ చేయాలన్నా పాస్వర్డ్ అడుగుతుంది. దాంతో మీరు పాస్వర్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. మీ ఫోన్ ను దొంగలు ఎత్తుకెళ్లినా పవర్ ఆఫ్ చేయలేరు. మీరు వెంటనే ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేయగలిగితే పట్టుకోవచ్చు.

MOST READ : 

  1. Bharosa : భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  3. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..!

  4. Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

మరిన్ని వార్తలు