క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Liquor : స్పిరిట్ నింపి, లేబుల్స్ అంటించి.. ఈ ముఠా మామూలోళ్లు కాదు..!

Liquor : స్పిరిట్ నింపి, లేబుల్స్ అంటించి.. ఈ ముఠా మామూలోళ్లు కాదు..!

మేళ్లచెరువు, మనసాక్షి :

హైదరాబాదు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సూపరెండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టగా సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా పట్టుబడింది.

హుజూర్ నగర్ ఎక్సైజ్ సిఐ నాగార్జున రెడ్డి వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో ఎపిలోని నకిలీ మద్యం లింకులు తేలాయి. రామాపురం గ్రామంలోని ఓ గోదాము లో నూకల రామసూర్య ప్రకాశ్ రావు, తోట శివశంకర్ లు ఖాళీ బాటిల్స్ కొనుక్కొచ్చి, స్పిరిట్ ను నింపి మూతలు బిగించి, లేబుళ్లను అంటించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా ఖాళీ మద్యం బాటిళ్లు,స్పిరిట్,లేబుళ్లను పోలీసులు స్వాధీనం చేఅకున్నారు. మద్యాన్ని తయారు చేసి ఓ కారు లో ఎపికి తరిలిస్తున్నట్లు కనుగొన్నారు. 600 లీటర్ల స్పిరిట్, 240 లీటర్ల మద్యంతో నింపిన 37 కాటన్లు,11,800 ఖాళీ బాటిల్స్,100 కేజీల బాటిళ్ల మూతలు(క్యాప్స్),7814 లేబుల్స్,ఇతరత్రా తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

దీని విలువ 15 లక్షల వరకూ ఉంటుందని సిఐ వెల్లడించారు.హైదరాబాదు కు చెందిన రూతుల శ్రీనివాస్,కృష్ణా ఫార్మాకు చెందిన శివచరణ్ సింగ్ ద్వారా బాటిళ్ల మూతలు,లేబుళ్లు కొన్నట్లు తేలిందన్నారు. దీంతో, వీరిద్దరితో పాటు నూకల రామ సూర్య ప్రకాశ్ ను అరెస్ట్ చేయగా, తోట శివశంకర్ పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు.

MOST READ : 

  1. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Suryapet : సూర్యాపేటలో భారీగా.. 18 కిలోల బంగారం దోపిడీ..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  4. TG New : ఆ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

మరిన్ని వార్తలు