Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Kabaddi : రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్ గా శ్రీకాంత్..!

Kabaddi : రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్ గా శ్రీకాంత్..!

నారాయణపేట టౌన్, మన సాక్షి :

నారాయణపేట జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీకాంత్ 18 ఏళ్ల విభాగంలో రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్ గా ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి వెంకటప్ప తెలిపారు. ధన్వాడ మండలo బుడ్డ మరి తాండకు చెందిన శ్రీకాంత్ డిగ్రీ మొదటి సంవత్సరము చదువుతున్నట్లు ఆయన తెలిపారు.

తల్లిదండ్రులు సీతమ్మ, శంకర్ నాయక్ వ్యవసాయ కూలీలని తెలిపారు. ఈనెల 28 నుంచి జూలై 1వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నారని తెలిపారు. విద్యార్థికి జిల్లా యువజన క్రీడా అధికారి వెంకటేష్, వ్యాయామ ఉపాధ్యాయులు అనంత సేన, బాలరాజ్, సాయినాథ్, రవి కుమార్ రామకృష్ణ, విష్ణు అభినందనలు తెలిపారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ రైతులకు భారీ శుభవార్త.. అందుబాటులోకి ధాన్యం తడిసినా.. ఆరబెట్టే యంత్రం..!

  2. Annadata Sukhibhava : రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Uttarakhand : అలకనంద నదిలో బస్సు బోల్తా.. 10 మంది గల్లంతు..!

  4. District Collector : జిల్లా కలెక్టర్ ఆకాంక్ష.. మహిళలు కోటీశ్వరులు గా మారాలి..!

  5. Miryalaguda : పేద విద్యార్థికి ట్రిపుల్ ఐటీలో సీటు.. దాతలు సహకరిస్తేనే జాయినింగ్..!

మరిన్ని వార్తలు