సూర్యాపేట : ఘనంగా భోగి వేడుకలు

రాష్ట్ర ప్రజలకు బోగి శుభాకాంక్షలు - మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట : ఘనంగా భోగి వేడుకలు

సూర్యాపేట, మనసాక్షి : భోగి పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్య నగర్, (45వార్డులో) భోగి మంటలు, సంక్రాంతి వేడుకలు శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి భోగి మంటలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో కౌన్సిలర్ గండురి పావని కృపాకర్, జిల్లా గ్రంధాలయల చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,bబి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, బి. ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.

దేశ ప్రజల సంక్షేమమే కేసీఆర్ సంకల్పం : 

రాష్ట్ర ప్రజలకు బోగి శుభాకాంక్షలు – మంత్రి జగదీష్ రెడ్డి

ప్రతికూల ఆలోచనలు వదిలి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలనే సందేశాన్నిచ్చే బోగీ పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నూతన కాంతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక పండుగ మ‌న స‌మాజంలో ఆనంద‌మ‌య స్ఫూర్తిని పెంపొందింప‌జేయాలని కోరారు.అంద‌రికీ మంచి ఆరోగ్యం, శ్రేయ‌స్సు చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాని తెలిపారు.’మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు’ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.