Hyderabad : సికింద్రాబాద్ లో గుట్టలుగా నోట్ల కట్టలు.. స్థానికంగా కలకలం..!

Hyderabad : సికింద్రాబాద్ లో గుట్టలుగా నోట్ల కట్టలు.. స్థానికంగా కలకలం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్లో నోట్ల కట్టల కలకలం రేపింది. అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ నడిబొడ్డున నోట్ల కట్టలు కుట్టలుగా పడి ఉండడంతో సంచలనం కలిగింది. భారీగా నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ లోని ఓ పాత గోదాములో పోలీసులు దాడులు చేశారు. అక్కడికి వెళ్ళాక చూస్తే నోట్ల కట్టలను చూసి పోలీసులు షాక్ తిన్నారు. సుమారు 8 కోట్ల రూపాయలకు పైగా గోదాంలో పడి ఉండడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి వివరాలు వెల్లడించారు.
ATM లలో డబ్బులు డిపాజిట్ చేసే సంస్థకు చెందినదిగా తేల్చారు. ఏజెన్సీ వారు సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో వారం రోజులుగా వారు విధులను బహిష్కరించారు. అయితే ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన డబ్బులు సిబ్బంది ఏం చేయాలో తెలియక అక్కడ దాచారు. అయితే ఏటీఎంలో ఏజెన్సీ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!
-
KSRTC : చీ.. చీ.. నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై బస్ కండక్టర్.. (వీడియో వైరల్)
-
BREAKING : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..!
-
Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!
-
Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!









