సూర్యాపేట : రాష్ట్ర మహిళ క్రికెట్ జట్టుకు ఎంపికైన శ్రావణి

అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట : రాష్ట్ర మహిళ క్రికెట్ జట్టుకు ఎంపికైన శ్రావణి

అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి

 

సూర్యాపేట , మనసాక్షి

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన డి. శ్రీనివాస్, యమున దంపతుల కుమార్తె శ్రావణి అండర్-15 బీసీసీఐ మహిళ హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ఎంపికైంది.ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చo అందజేసింది.

.శ్రావణి మున్ముందు జాతీయ జట్టులో ఆడాలని దీవించాడు…23 వ తేదీ 9 వ నెల 2007 లో జన్మించిన శ్రావణి చిన్నతనం నుండి క్రికెట్ పై మక్కువ పెంచుకుంది…తల్లి తండ్రుల సహకారంతో పాటు కోచ్ లు మల్లేష్, సతీష్, దుర్గాప్రసాద్ తివారి ల శిక్షణలో రాష్ట్ర జట్టుకు ఎంపికైంది.ఎమ్ ఎస్ డీ సెంటర్ ఆఫ్ క్రికెట్ మేడిపల్లి, హైదరాబాద్ లో శిక్షణ తీసుకొని క్రికెట్ లో బాగా రాణించి జట్టుకు ఎంపిక కావడం విశేషం.

ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ జాతీయ మహిళ జట్టులో రాణించడమే తన ద్యేయమని, నేను పుట్టిన గడ్డ సూర్యాపేట పేరు ను ప్రపంచ స్థాయిలో వినిపించేందుకు జాతీయ జట్టుకు ఎంపికై రాణిస్తానని, తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, నా గురువులు(కోచ్) లకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపింది.