రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలతో మిర్యాలగూడకు వన్నె – డి.ఎస్.పి వెంకటేశ్వరరావు

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలతో మిర్యాలగూడ వన్నె – డి.ఎస్.పి వెంకటేశ్వరరావు

సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీలతో మిర్యాలగూడ క్రీడలకు వన్నెతెచ్చిన “రంగ శ్రీధర్…

మిర్యాలగూడ, అక్టోబర్ 23, (మన సాక్షి స్పోర్ట్స్ ప్రతినిధి) : ప్రముఖ రైస్ మిల్లర్ సామాజికవేత్త, నల్గొండ జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ కోశాధికారి, రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీల నిర్వాహకులు రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో తొలిసారిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్ లో గల క్లియో స్పోర్ట్స్ అరేనా లో 8వ యోనెక్స్ సన్‌రైజ్ “తెలంగాణ స్టేట్ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్” ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిశాయి.

రాష్ట్రస్థాయి అండర్ -13 బ్యాడ్మింటన్ పోటీలకు రాష్ట్ర నలుమూల జిల్లాల నుంచి బాల, బాలికల క్రీడాకారులు 198 హాజరయ్యారు. ఈ పోటీలు ఈ నెల 19, 20 తేదీలలో క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు జరగగా అనంతరం ఫ్రీ క్వార్టర్ ఫైనల్, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు ఆదివారం హోరా హోరీ పోటీలు జరిగి ఘనంగా ముగిసాయి. ఈ పోటీలను రంగా శ్రీధర్ లక్షలాది రూపాయలు చేయూత నందించడంతో క్రీడాకారులకు వారి తల్లిదండ్రులకు వసతి భోజన సౌకర్యం కల్పించడంతో బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ చాంపియన్ షిప్ పోటీలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ క్రీడలతో మిర్యాలగూడకు వన్నెతెచ్చారని పలువురు సీనియర్ క్రీడాకారులు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన బాలికల డబుల్ ఫైనల్ మ్యాచ్ ను మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటేశ్వరరావు, సిఐలు నిగిడాల సురేష్ కుమార్, రాఘవేందర్, రంగా శ్రీధర్, కూతురు డాక్టర్ రంగా వర్ష, కుమారుడు రంగా శ్రీరామ్, కుకడపు శ్రీజ, లతో కలిసి ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించారు.

ఫైనల్ మ్యాచ్ ను డిఎస్పి, సిఐలు తిలకించారు. ఈ సందర్భంగా పలువురు రంగా శ్రీధర్ కు ప్రశంసలు, అభినందనలతో ముంచెత్తారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొన్న అతిధులందరికీ రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బ్యాట్మెంటన్ అసోసియేషన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు, బ్యాట్మెంటన్అసోసియేషన్, కోచ్ రామకృష్ణ, క్లియో స్పోర్ట్స్ అరేనాల స్టేడియం నిర్వాహకులు, ఏచూరి శ్రీ హర్ష, నేతి రాహుల్, పిడి వెంకటేశ్వర్లు యాదవ్, మోహన్ డాక్టర్ అంజయ్య, క్రీడాకారుడు అన్సార్ భాష, తదితరులు పాల్గొన్నారు.