Suryapet : ఘనంగా అష్టోత్తర శతఘటాభిషేకం

ఘనంగా అష్టోత్తర శతఘటాభిషేకం

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ రోడ్ లో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమజ్జయంతి ఉత్సవములలో బాగంగా గురువారం రెండవ రోజు వేద పండితులు టీ. ఫణి కుమారాచార్యులు ఆధ్వర్యంలో సుందరహోమం, శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి పంచామృతములతో ప్రత్యేక అష్టోత్తర శతఘటా భిషేకం (108 కలశములు) తో పాటు అర్చనలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా సుందరకాండ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం భగవద్గీత పారాయణం హనుమాన్ చాలీసా పారాయణములు సూర్యాపేట భక్త బృందం చే నిర్వహించారు. దేవాలయ ప్రధానార్చకులు దరూరి రామానుజచార్యులు మాట్లాడుతూ ఈనెల 12న లక్ష నాగవల్లి దళార్చన 13న లక్ష మల్లెల పుష్పార్చన 14 ఆదివారం హనుమాన్ జయంతి సందర్భంగా 108 పర్యాయములు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు కార్యనిర్వాహణ అధికారి ఎంపీ లక్ష్మణరావు అర్చకులు ధరూరి శ్రీధరాచార్యులు, దరూరి శ్రీనాథ చార్యులు దరూరి భాను కుమార్ దేవాలయ జూనియర్ అసిస్టెంట్ కీసర దేవేంద్ర చార్యులు,

 

మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్ , బోనగిరి వెంకటేశ్వర్లు, వాసా నాగేశ్వరరావు, దంతాల కొండల నాయుడు, పురం నాగరాజు, పబ్భా రజని, కే నారాయణ రావు, కొత్త శ్రీనివాస్, నాగరాజు, చిత్తలూరు శ్రీధర్, మంచాల రంగయ్య, పబ్బా రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.