BREAKING : ఆమనగల్లు లో విద్యార్థిని ఆత్మహత్య

ఆమనగల్లు లో విద్యార్థిని ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రతినిధి , మనసాక్షి:

ఇటీవల పదవ తరగతి పూర్తి చేసుకున్న గిరిజన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుపట్టణం లో చోటు చేసుకుంది.

 

ఆమనగల్లు మండలం రామంతల గ్రామ మాజీ సర్పంచ్ శ్వేత ఆనంద్ కుటుంబం ఆమనగల్లు పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.వారి కుమార్తె శ్రీనిధి 16 ఇటీవల పదవ తరగతి ఉత్తీర్ణత సాధించింది. పై చదువుల కోసం హైదరాబాదులోనే ఓ ప్రైవేట్ కళాశాలలో వారి తల్లి దండ్రులు చేర్పించారు.

 

హాస్టల్ లో ఉండటం ఇష్టం లేని మంగళవారము ఉదయము ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.గుర్తించిన కుటుంబ సభ్యులు ఫటాఫట్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.