అనారోగ్యానికి గురైన విద్యార్థిని.. టిసి ఇచ్చి బయటకి పంపిన గురుకుల ప్రిన్సిపల్..!

పాఠశాలలో అనారోగ్యానికి గురైతే ప్రిన్సిపాల్ టిసి ఇచ్చి బయటికి పంపించిన సంఘటన శుక్రవారం చివ్వెంల మండలం ఐలాపురంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.

అనారోగ్యానికి గురైన విద్యార్థిని.. టిసి ఇచ్చి బయటకి పంపిన గురుకుల ప్రిన్సిపల్..!

చివ్వెంల, మన సాక్షి :

పాఠశాలలో అనారోగ్యానికి గురైతే ప్రిన్సిపాల్ టిసి ఇచ్చి బయటికి పంపించిన సంఘటన శుక్రవారం చివ్వెంల మండలం ఐలాపురంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.

బాధిత విద్యార్థి ధారావత్ పురందరేశ్వరి ఆమె తండ్రి వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం…… మునగాల మండలం నేలమర్రి గ్రామం ఈదుల వాగు తండాకు చెందిన ధారావత్ పురందరేశ్వరి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో గత సంవత్సరం నుంచి విద్యాభ్యాసం కొనసాగిస్తుంది.

ALSO READ : Whatsapp Channel : వాట్సప్ ఛానల్ చికాకు కలిగిస్తుందా.. ఇలా తొలగించుకోండి..!

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఐలాపురంలో 9వ తరగతి చదువుతుంది. గత కొంతకాలంగా కిడ్నీలో స్టోన్ రావడంతో ఆమె తండ్రి తరచూ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నారు. దీంతో హాజరు శాతం లేదు అని పురంధరేశ్వరుని నాలుగు నెలల తర్వాత పాఠశాల నుండి టిసి ఇచ్చి బలవంతంగా బయటికి పంపించారు.

అనారోగ్యం బాగా లేక ఆసుపత్రికి తీసుకు వెళుతున్నానని విద్యార్థిని తండ్రి వేడుకున్న హౌస్ మేడం ప్రిన్సిపాల్ మేడంలు వినకుండా బలవంతంగా టిసి ఇచ్చారని…. తనపై కక్ష కట్టి, కండక్ట్ విషయంలో తప్పుగా రాశారని తెలిపారు.

ALSO READ : Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!