Kodada | కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

Kodada | కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

కోదాడ , మనసాక్షి :
విద్యార్థులు బాల్యం నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని  సాధన కొరకు నిరంతరం కృషి చేయాలని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు.

 

మంగళవారం కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ స్థాయిలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన  ప్రభుత్వ,ప్రైవేటు విద్యార్థులుకు నిర్వహించిన  ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

 

Also Read : Phonepe : ఫోన్ పే వాడుతున్నారా…? అయితే మీకు ఓ గుడ్ న్యూస్..!

 

విద్యార్థి దశలోనే వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఆత్మవిశ్వాసం, ప్రేరణ కలిగి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. విద్యార్థులు విద్యతోపాటు సమాజం పై అవగాహన కలిగి ఉండి అన్ని రంగాల్లో రాణించాలన్నారు.

 

విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలోప్రతి సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించి వారికి పురస్కారాలు అందజేయడం పట్ల ట్రస్ట్ అధ్యక్షులు చారుగండ్ల రాజశేఖర్ ను ఈ సందర్భంగా వారు అభినందించారు.

 

అనంతరం 125 మంది విద్యార్థులకు మేమెంటో, ప్రశంసా పత్రాలు అందజేశారు. కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల వారి సౌజన్యంతో నిర్వహించిన

 

Also Read : Aadhaar Card : ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త..!

 

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి. ఇరుకుల్లా చెన్నకేశవరావు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి వంగవీటి లోకేష్, పైడిమర్రి రామారావు, బడుగుల సైదులు, బండారు శ్రీనివాసరావు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.