Aadhaar Card : ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త..!

Aadhaar Card : ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త

మనసాక్షి, వెబ్ డెస్క్:

ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ముఖ్యమైన పత్రంగా మారింది. ప్రతిదానికి గుర్తింపు కార్డు ఆధార్ కార్డు గానే వినియోగిస్తున్నారు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త . మీరు ఆధార్ కార్డు లేకుంటే మీ ఇంటి నుంచి బ్యాంకు వరకు ఏ పని చేయలేరు. ప్రస్తుతం ఆధార్ అప్డేట్ ఫోన్ నెంబర్ లింక్ కూడా అడుగుతున్నారు.

 

ప్రస్తుతం యుఐడిఎఐ (UIDAI).. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అనేక సౌకర్యాలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ సౌకర్యాలను జూన్ 14వ తేదీ వరకు పొందే అవకాశం ఉంది. యు ఐ డి ఏ ఐ (UIDAI) నుంచి మీరు అనేక సౌకర్యాలను ఉచితంగా పొందవచ్చు.

 

అవి ఏమిటో తెలుసుకుందాం…

ఆధార్ కార్డు అప్డేట్ :

 

ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. అంతకుముందు మీరు ఆధార్ లో అప్డేట్ చేసుకోవాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. 50 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు.

 

అధికారిక వెబ్ సైట్ లో :

 

ఆధార్ కార్డును ఉచితంగా అధికారిక వెబ్ సైట్ లో అప్డేట్ చేసుకోవచ్చు. మై ఆధార్ పోర్టల్ నుంచి మాత్రమే యు ఐ డి ఏ ఐ అందించిన ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చును.

 

 

మీరు ఆధార్ కేంద్రానికి వెళ్తే దానికోసం 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు ఎలాంటి డిస్కౌంట్ కూడా లభించదు. ఆధార్ లో అప్డేట్ చేయడానికి ఐడి ప్రూఫ్ అందించాలి. దాంతో పాటు ఇంటి చిరునామాను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

 

ఈ పత్రాల ఆధారంగా మాత్రమే మీ జనాభా వివరాలు అంగీకరించబడతాయి. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసే సదుపాయం పోర్టల్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుసుకోవాలి.

 


ఆధార్ కార్డును అప్డేట్ చేయడం ఎలా..?

 

> https://myaadhaar.uidia.gov.in/ లింక్ క్లిక్ చేయండి.

> దీని తర్వాత ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి.

> ఆ తర్వాత ఓటిపి నమోదు చేయాలి.

> ఆ తర్వాత ఏం అప్డేట్ చేయాలనో ఎంచుకోవాల్సి ఉంటుంది.

> ఆ తర్వాత వెరిఫై క్లిక్ చేయండి.

> దాని తర్వాత మీరు డ్రాప్ లిస్టులో ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ను స్కాన్ చేసి లోడ్ చేయాలి.

> తర్వాత సబ్ మిట్ క్లిక్ చేయాలి.

> ఆ తర్వాత నీకు ఓటిపి నెంబర్ వస్తుంది.

> ఆధార్ అప్డేట్ ఫారం సబ్మిట్ అవుతుంది.

> ఆ తర్వాత రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది.

> దాంతో ఆధార్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

> ఆధార్ కార్డు అప్డేట్ అయిన తర్వాత మీరు అప్డేట్ చేసిన ఆధార్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.