Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

ఎరువుల వ్యాపారులకు వ్యవసాయధికారి హెచ్చరిక.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!

కేతేపల్లి మండల కేంద్రంలోని ఆదీకృత విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను సోమవారం మండల వ్యవసాయ అధికారి బి. పురుషోత్తం తనిఖీ చేశారు.

ఎరువుల వ్యాపారులకు వ్యవసాయధికారి హెచ్చరిక.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ..!

కేతేపల్లి మనసాక్షి.

కేతేపల్లి మండల కేంద్రంలోని ఆదీకృత విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను సోమవారం మండల వ్యవసాయ అధికారి బి. పురుషోత్తం తనిఖీ చేశారు. షాపులలో ఉన్న ఎరువుల నిల్వలను వాటికీ సంబంధించిన రసీదులను అయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరు డీలర్స్ కూడా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచాలని, ఎం.ఆర్.పి. ధరకే అమ్మాలని, ఎరువులకు సంబంధించిన బిల్స్, స్టాక్ రిజిస్టర్స్ తప్పనిసరిగా రోజువారీ అప్డేట్ చేయాలని డీలర్లను ఆదేశించామని ఆయన తెలిపారు.

రైతులకు ఎరువులను తప్పనిసరిగా ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు ఈపాస్ ద్వారానే అమ్మాలని అయన తెలిపారు తెలిపారు.
ఎరువుల వాస్తవ నిల్వలకు ఈపాస్ మెషిన్ నిల్వలకు ఎలాంటి తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు . రైతులకు నాణ్యమైన ఎరువులను మాత్రమే అమ్మాలని ఎలాంటి నకిలీ ఎరువులను అమ్మరాదనీ, అమ్మిన యెడల చట్ట పరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అయన హెచ్చరించారు .

మండలంలో ప్రస్తుతం వ్యవసాయ అవసరాలకు కావలిసిన యూరియా , డి ఏ పి , కాంప్లెక్స్ ఎరువులు మండల పరిధిలోని పిఏసిఎస్, ఏఆర్ఎస్ కె, ఎన్డిసిఎంఎస్, ప్రైవేట్ ఎరువుల షాపులలో అందుబాటులో ఉన్నవని అయన వివరించారు.

మరిన్ని వార్తలు