Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Minister Uttam : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య.. పంటలు కాపాడటం.. తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం..!

దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.

Minister Uttam : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య.. పంటలు కాపాడటం.. తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.6 కోట్ల మందికి రేషన్ కార్డులు..

3 కోట్ల 48 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు 15000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం పంపిణీ-

మిర్యాలగూడ లో రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి

మిర్యాలగూడ, మన సాక్షి :

దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి ఎస్.వి గార్డెన్స్ లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, అలాంటిది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి 6 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని,3 కోట్ల 48 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు 15000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో గతంలో 86 వేల 960 రేషన్ కార్డులు ఉంటే తాము అధికారంలోకి వచ్చాక జనవరి 2025 నుండి ఇప్పటివరకు 101688 రేషన్ కార్డులు ఇచ్చామని, మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రస్తుతం స్మార్ట్ రేషన్ కార్డుల సంఖ్య ఒక లక్ష 526 కి చేరిందని తెలిపారు. గతంలో 2,56,000 మందికి రేషన్ బియ్యం ఇస్తుండగా, తాము అదనంగా 42,000 మందికి రేషన్ రేషన్ ఇస్తున్నామని, ప్రస్తుతం రెండు లక్షల 98,590 మందికి సన్న బియ్యం ఇస్తున్నామన్నారు.

Also Read : చలో విజయవాడ కు వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులకు అనుమతి లేదు..!

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి విడుదలపై మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం నాగార్జునసాగర్ ఆయకట్టు కింద వేసిన పంటలు కాపాడడం తో పాటు, వచ్చే వేసవి ఆపై వరకు ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మిర్యాలగూడ నియోజకవర్గం లో 878 కోట్ల రూపాయలతో 6 లిఫ్టు ఇరిగేషన్లకు శంకుస్థాపనలు చేయగా, తాము అధికారంలోకి వచ్చాక 175 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు.

Also Read : Miryalaguda : మిర్యాలగూడలో దసరా ఉత్సవాలకు ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ లో భూమి పూజ..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో చేపట్టిన 6 లిఫ్ట్ ఇరిగేషన్ లను తమ హయాంలోనే పూర్తి చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని దున్నపోతుల గండి, బత్తలపాలెం, కేశవాపురం, వీర్లపాలెం, నెల్లికల్ తదితర ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేశామని ,ఈ హయాంలోనే వాటిని పూర్తి చేస్తామని, బ్రాహ్మణ వెల్లేముల ,ఉదయ సముద్రం, ఐటిపాముల లను తమ హాయంలోనే పూర్తి చేస్తామని తెలిపారు. జూన్ 2028 నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3,50,000 ఎకరాలకు సాగునీరందిస్తామని తెలిపారు. అలాగే నక్కలగండి, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి గ్రామానికి చౌక ధర దుకాణం మంజూరు చేస్తామని , నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, నర్సింగ్ కళాశాల పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేస్తామని ,అలాగే మిర్యాలగూడ పట్టణంలోని ఫ్లైఓవర్ కు సంబంధించిన ఫైలు క్లియర్ చేస్తామని ,మిర్యాలగూడ బస్టాండ్ ఆధునికరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కానీ తాము అధికారంలోకి వచ్చాక స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఎల్ నినో ప్రభావం వల్ల నాగార్జున సాగర్ నుండి సాగునీటిని విడుదల చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న పంటలు కాపాడడంతో పాటు, చెరువులను నింపడం, హైదరాబాద్ వరకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని, నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని, రైతులకు సాగునీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు . మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, పేదలందరికీ సన్నబియనిస్తున్నామని, మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నదని తెలిపారు.

Also Read : Miryalaguda: మిర్యాలగూడలో సంచలనం.. సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ భార్గవ్..!

నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేయాలని, అర్హత ఉన్న ప్రతి గ్రామానికి చౌకధర దుకాణం మంజూరు చేయాలని, మిర్యాలగూడ లో ఎన్ఎస్ పి స్థలంలో తహసిల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నిధులు కేటాయించాలని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని, డిఎంఎఫ్ టి , సిఎస్ఆర్ నిధుల ద్వారా అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, రేషన్ కార్డులలో కొత్తవారిని చేర్చడం జరిగిందని, ప్రతి రేషన్ కార్డుదారుకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతున్నదని, స్మార్ట్ రేషన్ కార్డు వల్ల బియ్యం తీసుకున్నది లేనిది తెలుసుకునే వివరాలతో పాటు, పూర్తి వివరాలను ట్రాక్ చేసే అవకాశం ఉందని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల జనాభా లో లక్ష 1688 స్మార్ట్ రేషన్ కార్డులివ్వడమే కాకుండా, 11 కోట్ల రూపాయల సబ్సిడీతో సన్నబియ్యం ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సుధ మాట్లాడారు.
మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, పౌరసరఫరాల డిఎం రాంపతి నాయక్, డిఎస్ఓ వెంకటేష్, స్థానికతహసిల్దార్ శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్, నియోజకవర్గంలోని తహసిల్దారులు, తదితరులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

మరిన్ని వార్తలు