Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda: మిర్యాలగూడలో సంచలనం.. సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ భార్గవ్..!

మిర్యాలగూడలో రాజకీయాల్లో సోషల్ మీడియా సంచలనం కలిగిస్తుంది. ఫేస్ బుక్ లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారని మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పేర్కొన్నారు.

Miryalaguda: మిర్యాలగూడలో సంచలనం.. సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ భార్గవ్..!

మన సాక్షి, మిర్యాలగూడ :

మిర్యాలగూడలో రాజకీయాల్లో సోషల్ మీడియా సంచలనం కలిగిస్తుంది. ఫేస్ బుక్ లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారని మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పేర్కొన్నారు. తనపై ఏఐ టెక్నాలజీ ఉపయోగించి బాడీ షేవింగ్ తో కూడిన ఫోటోలతో వ్యక్తిని కించపరిచేలా అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టారని శనివారం ఆయన మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : Miryalaguda : వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు.. నీ బండారం బయటపడుద్ది.. ఎమ్మెల్యే కు బిఆర్ఎస్ నాయకుల కౌంటర్..!

తనను కించపరిచేలా అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెడుతూ పట్టణంలో శాంతియుతంగా ఉన్న ప్రజల మధ్య రాజకీయ చర్చలు పెడుతూ రెచ్చగొడుతూ గొడవలు సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టే వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన విన్నవించారు. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు సహజమని వ్యక్తిగత కక్షతో పోస్టులు చేయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

తాను మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన పదవీకాలంలో ఏవైనా నిధుల దుర్వినియోగం ఉంటే విచారణ చేయాల్సింది పోయి తనపై వ్యక్తిగత పోస్టులు పెడుతూ.. ఇంతకు ముందు లేనివిధంగా వాతావరణాన్ని కలుషితం చేయటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. తన పదవీకాలం ముగిసి 20 నెలలు అవుతుందని, కొత్త మున్సిపల్ పాలకవర్గం ఏర్పదడి కూడా ఏడు నెలలకు పైగా గడిచిందని, అదేవిధంగా శాసనసభ్యులు ఎన్నికై కూడా సుమారు 34 నెలలు దాటిందని పేర్కొన్నారు. తాను గాని తన సతీమణి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో ఎలాంటి దుర్వినియోగం చేయలేదని స్పష్టం చేశారు.

తమ కుటుంబం ప్రజాసేవ కోసం ఉన్నదని భార్గవ్ పేర్కొన్నారు. తన తండ్రి తిరునగర్ గంగాధర్ స్వాతంత్ర సమరయోధులుగా మిర్యాలగూడ పట్టణానికి ప్రజాసేవ చేశారని, తన సోదరుడు రమేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పనిచేశారని తెలిపారు. మా మీద గాని, నామీద గాని నిధుల దుర్వినియోగం జరిగిందని ఎవరికి ఏమైనా ఆధారాలు ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదని, సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు.

Also Read : Miryalaguda: మిర్యాలగూడలో సంచలనం.. సోషల్ మీడియాలో పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ భార్గవ్..!

మున్సిపల్ భూముల ఆక్రమణ జరిగిందని అనుకుంటే ఆధారాలతో ఫిర్యాదు చేయాలని కానీ సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తిగత కక్షలు, అసత్య ఆరోపణలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు