Karimnagar : కరీంనగర్ లో వైద్య విద్యార్థి మృతి..!
ఎంబీబీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక మానసిక వేదనకు గురైన ఓ వైద్య విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Karimnagar : కరీంనగర్ లో వైద్య విద్యార్థి మృతి..!
కరీంనగర్ బ్యూరో , మనసాక్షి :
ఎంబీబీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక మానసిక వేదనకు గురైన ఓ వైద్య విద్యార్థి మృతి చెందిన ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా తాడిగడప గ్రామానికి చెందిన లారీ మెకానిక్ శంకర్‌బాబు కుమారుడు నాగడి పునీత్ వర్మ (28)కు 2019లో కౌన్సెలింగ్ ద్వారా ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు లభించింది.
దీంతో కరీంనగర్ బొమ్మకల్‌లోని చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్య విద్యలో చేరాడు. 2025లోనే ఎంబీబీఎస్ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ.. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరీక్షలకు సిద్ధ మవుతున్నాడు.
Also Read : Minister Uttam : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య.. పంటలు కాపాడటం.. తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం..!
కుమారుడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు కృష్ణా జిల్లా నుంచి కరీంనగర్‌కు వచ్చి కళాశాల సమీపంలోని గుంటూరుపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని అతడి వద్దే ఉంటున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో పునీత్ వర్మ తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అనంతరం అతడు మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తండ్రి శంకర్‌బాబుకు అప్పగించారు. తమ కుమారుడి మృతిపై ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









