Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునిజామాబాద్

పది రోజులుగా జాడ లేదు.. ఎలక్ట్రికల్ ఇంజనీర్ మిస్సింగ్..!

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన తాళ్ళ రఘు (29) ఎత్తు 5.9 అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయినట్లు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

పది రోజులుగా జాడ లేదు.. ఎలక్ట్రికల్ ఇంజనీర్ మిస్సింగ్..!

ఆర్మూర్, మన సాక్షి

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన తాళ్ళ రఘు (29) ఎత్తు 5.9 అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ గత కొద్దిరోజులుగా కనిపించకుండా పోయినట్లు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నిజామాబాద్‌ ఆలూర్ చిరునామాకు చెందిన తాళ్ళ రఘు గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్ నగోల్ మెట్రో ఆఫీస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

ప్రస్తుతం లక్ష్మారెడ్డి కాలనీ, ఉప్పల్‌లోని బాణుతేజ హాస్టల్‌లో నివాసముంటున్నాడు. ఈ నెల 16వ తేదీన (16/09/2026) హాస్టల్‌లో ఉన్నట్లు తన సోదరుడు తాళ్ళ వెంకటేష్‌తో ఫోన్‌లో మాట్లాడిన రఘు,17వ తేదీన తిరిగి ఇంటికి వస్తున్నట్లు వాట్సాప్ సందేశం పంపాడు.అయితే ఎంతకీ ఇంటికి చేరుకోకపోవడంతో పాటు,17వ తేదీ నుండి అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు,స్నేహితులను విచారించినా,నగోల్‌లోని ఆఫీస్‌కు వెళ్ళి చూసినా ఎలాంటి సమాచారం లభించలేదు.

అనంతరం హాస్టల్‌లో విచారించగా, 18వ తేదీ ఉదయం 9 గంటలకు “ఇంటికి వెళ్తున్నాను”అని చెప్పి హాస్టల్ నుండి బయలుదేరినట్లు తెలిసింది.రఘు జాడ తెలియకపోవడంతో అతని సోదరుడు పోస్ట్ ఆఫీస్ బి.పి.ఎమ్ తాళ్ళ వెంకటేష్ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ‘మ్యాన్ మిస్సింగ్’కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆచూకీ తెలిసినవారు ఈ 8500837443 నంబర్ కు కాల్ చేసి తెలుపగలరు.

మరిన్ని వార్తలు