సూర్యాపేట : జిల్లా కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఐటీ హబ్‌..!

సూర్యాపేట : జిల్లా కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఐటీ హబ్‌..!

సూర్యాపేటలో ఐటీ ఉద్యోగాలకు విశేష స్పందన

జాబ్ మేళా ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఐటీ హబ్‌లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మంగళ వారం తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది.

సూర్యాపేటజిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మంది అభ్యర్థులు వచ్చారు. స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఈ జాబ్‌మేళాను ప్రారంభించి ఆయా కంపెనీల ప్రతినిధులు, హాజరైన యువతతో మాట్లాడారు.

అనంతరం ఐటీ హబ్ లో ఉద్యోగాల కల్పనకు తొలి దశలో 15 కంపెనీలు రాగా వివిధ విభాగాల్లో పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల నియమక ప్రక్రియ ను ప్రారంభించారు. ఎంపిక ప్రక్రియలో ఐటి కంపెనీలు మూడు అంచెల విధానాన్ని అమలు చేయనున్నారు.

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!

తొలి దశలో 200 మందిని ఎంపిక చేయనున్ననారు. ఉద్యోగాలకు ఎక్కువగా బీటెక్‌, ఎంబీఏ, డిగ్రీ పూర్తి చేసిన వారు పోటీపడ్డారు. తల్లి దండ్రుల తో కలిసి పెద్ద సంఖ్యలో వచ్చిన అభ్యర్థులతో జాబ్‌ మేళా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ఉద్యోగార్థులకు ఇబ్బందులు లేకుండా మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో జిల్లా యత్రాంగం భోజనంతోపాటు మౌలిక వసతులు కల్పించారు.

కమ్యూనికేషన్స్‌, టెక్నాలజీపై ఉచిత శిక్షణ ఇస్తాం : 

ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం సాధించాలనే ఉద్దేశ్యం తో జాబ్ మేళా కు వేలాది గా యువత తరలి రావడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. జాబ్‌ రానివారు నిరాశ చెందాల్సిన పని లేదన్నారు.

ALSO READ : TS TET : టెట్ ఫలితాలకు అంతా సిద్ధం.. ఫలితాలు ఎప్పుడంటే..!

బీటెక్ చదివిన యువత కు టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌పై ఉచిత శిక్షణ ఇచ్చి ఐటీ రంగంలో ఉన్నతమైన ఉద్యోగాలు పొందేలా కృషి చేస్తాం అన్నారు.. రాబోయే రోజుల్లో 5 వేల ఉద్యోగాలు ఇవ్వటమే లక్ష్యంగా సూర్యాపేట ఐటి హబ్ ను తీర్చిదిద్దనున్నట్ల మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!