Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

సూర్యాపేట : షాపింగ్ మాల్స్ ఎదుట ఆశ్చర్యపోయేలా మున్సిపల్ సిబ్బంది వినూతన నిరసన ఎందుకో ..?

షాపింగ్ కాంప్లెక్స్ ల ముందు మున్సిపల్ సిబ్బంది వినూతన నిరసన ఎందుకో .

సూర్యాపేట , మనసాక్షి ;

 

సూర్యాపేట జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీలో మున్సిపల్ బిల్ కలెక్టర్లు , సిబ్బంది షాపింగ్ మాల్స్ వద్ద వినూతన నిరసన కార్యక్రమం చేపట్టారు. అది చూసిన పట్టణ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు.  అదేమిటంటే..

 

మున్సిపాలిటీలో ఆస్తి పన్ను కోసం నోటీసులు ఇచ్చినా కూడా స్పందించని యజమానుల ఇళ్ల వద్ద షాపింగ్ మాల్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపడితే చెల్లిస్తారని మున్సిపల్ సిబ్బంది భావించారు. అందుకోసం సిబ్బందితో సహా మాల్స్ ఎదుట నిరసన చేపట్టాలని నిర్ణయించారు.

పన్ను వసూళ్ల కార్యక్రమంలో భాగంగా…  సూర్యాపేట మున్సిపాలిటీ కి చెల్లించవలసిన ఇంటి పన్ను చెల్లించకపోవడం తో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని వసుంధర షాపింగ్ మాల్ ముందు , ఎం.జి.రోడ్ నందు గల బృందవన్ రెస్టారెంట్ ముందు మున్సిపల్ బిల్ కలెక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది షాపుల ముందు నిరసన తెలుపుతూ ధర్నా కు సోమవారం ఉదయం దిగారు.

 

ఈ విషయం గురించి అక్కడి వారు అరా తీయగా వసుంధర షాపింగ్ మాల్ వారు చెల్లించవలసిన ఇంటిపన్ను 845036/-లు బకాయి, సాయి బృందావన్ గ్రాండ్ బిల్డింగ్ యజమాన్యము వారు రూ 6,96,768/- లు బకాయి ఉన్నందున నోటీసులు జారీ చేశామని, బకాయి చెల్లించమని చెప్పిన ఎలాంటి స్పందన లేదని రాలేదని అన్నారు.

 

అందుకే నిరసన ధర్నా కు దిగమని అన్నారు.. ఇప్పటికైనా మున్సిపాలిటీకి చెల్లించవలసిన పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించగలరు.లేకపోతే రేపు అందరి ఇండ్ల వొద్ద ఇదే పరిస్థితి రావచ్చు…తస్మాత్ జాగ్రత్త..!

మరిన్ని వార్తలు