Suryapet : బైకు అదుపు తప్పి ఇద్దరు యువకులు మృతి..!
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారం మండల పరిధిలో ని గోపాలపురం స్టేజి వద్ద కల్వర్టుకు ఈ ద్విచక్ర వాహనం తగలడంతో ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు తగలడంతో హుటాహుటిన 108 అంబులెన్స్ కు గ్రామస్తులు ఫోన్ చేశారు.

Suryapet : బైకు అదుపు తప్పి ఇద్దరు యువకులు మృతి..!
తుంగతుర్తి, మన సాక్షి :
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారం మండల పరిధిలో ని గోపాలపురం స్టేజి వద్ద కల్వర్టుకు ఈ ద్విచక్ర వాహనం తగలడంతో ఇద్దరు వ్యక్తులకు బలమైన గాయాలు తగలడంతో హుటాహుటిన 108 అంబులెన్స్ కు గ్రామస్తులు ఫోన్ చేశారు. ఇక వివరాలకు వెళితే గంగడి విష్ణు (21) గ్రామం గన్నారం మండలం రాయపర్తి విధులు వరంగల్ వాసి, గంగారబోయిన అరవింద్ (20) స్నేహ పేట గ్రామం యువకులు గోపాలపురం గ్రామం సూపర్వైజర్ గా ఉన్నారు.
11 గంటల సమయంలో తిరువూరు వ్యక్తులు తమ బైక్ టిజి 06.u.4909 పై నాగారం మండలం లక్ష్మాపురం గ్రామ శివారులోని కోళ్ల ఫారం దాటి తిరుమలగిరి వస్తుండగా గోపాలపురం గ్రామ శివారు వద్ద కు రాగానే వారు నడిపే బైకు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న కల్వర్టును తగలడంతో ఇద్దరు బలమైన గాయాలతో ఎగిరిపడ్డారు. వారిని 108 వాహనం లో తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తక్షణమే గోపాలపురం వద్ద ఉన్న ప్రజలు పోలీసులకు తెలపడంతో వారి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం తుంగతుర్తి హాస్పిటల్ కు తరలించారు. ఇంకా వివరాలు తెలియవలసి ఉన్నది.









