ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
ఇల్లంతకుంట , మన సాక్షి
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండంలోని గాలిపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం గాలిపెల్లి గ్రామానికి చెందిన పల్లె నాగరాజు (36)గత కొన్ని రోజుల నుండి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, ఇటీవల కరీంనగర్ లో ఇల్లు కొనుగోలు చేసి క్రమంలో రెండు లక్షల రూపాయల వరకు అప్పు చేయడం తో తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి భార్య నీరజ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.