ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం

ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం

కనగల్ , మన సాక్షి

ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి కనగల్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై యు. నగేష్ తెలిపిన వివరాల ప్రకారం… కురెంద ప్రదీప్ అలియాస్ చంటి (31) తన భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపంతో రాత్రి అందరూ పడుకున్నాక ఇంట్లోని స్లాబుకున్న కొండికి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 

కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే ప్రదీప్ మృతి చెంది ఉరికి వేలాడుతున్నాడు. భార్య కాపురానికి రానప్పటి నుంచి తల్లి దగ్గరే ఉంటున్న ప్రదీప్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ మధ్యానికి బానిస అయ్యాడు. మృతుడి తల్లి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.