స్వగృహ ఇళ్ళను పేదలకు పంపిణీ చేయాలి

టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

స్వగృహ ఇళ్ళను పేదలకు పంపిణీ చేయాలి

టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి

జవహర్ నగర్ , మనసాక్షి

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వగృహ ఇళ్ళ నిర్మాణం, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ళ నిర్మాణాన్ని పట్టించుకోని వైనం. నిరుపయోగంగా ఉన్న స్వగృహ సముదాయాన్ని సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి.

 

స్వగృహ సముదాయాన్ని పరిశీలించిన అనంతరం హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి డబుల్ బెడ్ రూం ఇళ్ళను నిర్మించి ఇవ్వడం ఎలాగూ చేతకాదు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు జవహర్ నగర్ ప్రజలకు ఓట్ల కోసం పనికిమాలిన హామీలు ఇచ్చారు. జవహర్ నగర్ నా గుండెకాయ అనే స్థానిక మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇళ్ళు కనపడడం లేదా? కాంగ్రెస్ పార్టీ నిర్మించిన స్వగృహ ఇళ్ళను పంచితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని వాటిని గాలికొదిలేసిన తీరు గర్హనీయం.

అత్యంత నాణ్యతతో స్వగృహ సముదాయాన్ని నిర్మించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే స్థానిక మంత్రి మల్లారెడ్డి, అధికారులు స్పందించి గృహ సముదాయంలో నిర్మాణమైన ఇళ్ళను పూర్తిగా నవీకరణ చేసి స్థానిక పేదలకు పంపిణీ చేయాలి. జవహర్ నగర్, దమ్మాయిగూడ పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది నిరుపేదలు స్వగృహ ఇళ్ళను వెంటనే స్థానికులకు కేటాయించకపోతే మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని,

ఈ ప్రభుత్వం స్పందించి వీటిని స్థానికులకు కేటాయించకపోతే టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక పేదలకు పంపిణీ చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.