Hyderabad : డ్రాయింగ్ పోటీల్లో డక్కన్ స్ప్రింగ్ విద్యార్థుల ప్రతిభ..!

Hyderabad : డ్రాయింగ్ పోటీల్లో డక్కన్ స్ప్రింగ్ విద్యార్థుల ప్రతిభ..!
నాచారం, మన సాక్షి:
రాష్ట్రస్థాయి 6వ డ్రాయింగ్ పోటీల్లో నాచారం డక్కన్ స్ప్రింగ్ పాఠశాల విద్యార్థుల సృజనాత్మకత ప్రతిభవంతంగా మెరిసిందని చైర్మెన్ నవనీతరావు, ప్రిన్సిపాల్ స్వర్ణ అక్కినేని విద్యార్థులను అభినందించారు. శేరిలింగపల్లిలో నిర్వహించిన 6వ తెలంగాణ రాష్ట్రస్థాయి డ్రాయింగ్ పోటీల్లో డక్కన్ స్ప్రింగ్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రత్యేక గుర్తింపు పొందారు.
రాష్ట్ర స్థాయిలో హనియా ఫాతిమా, సయ్యద్ ఆఫియా ఫాతిమా, అనుల్ పులగం అత్యుత్తమ విజయాలతో నిలిచి పాఠశాలకు గౌరవం తీసుకువచ్చారు. జిల్లా స్థాయిలోనూ ఇషాన్ దాసరి, నక్షత్ర రావు మధురి, కటకం సూర్యాన్, దయాగ రిత్విక్ తమ మేధస్సు, కళాప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మెన్, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లోని కళా ప్రతిభ, ఊహాశక్తి,అంకితభావం స్పష్టంగా ప్రతిఫలించాయని పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి వేదికలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. విద్యార్థుల సాధనలను అభినందిస్తూ ప్రశంసలు తెలియజేస్తూ, వారి విజయాల వెనకుండి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు
తెలిపారు.
MOST READ :









