Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

Telangana : బిజెపి ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..?

Telangana : బిజెపి ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..?

హైదరాబాద్, మన సాక్షి :

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపేందుకు ఉవిల్లు ఊరుతుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై జాతీయ నేతలు దృష్టి పెట్టారు. తెలంగాణలో ఎక్కువ స్థానాలు బిజెపి కైవసం చేసుకునే విధంగా ముందడుగు వేస్తున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కతం అయిందని ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈరోజు ఎంపీ స్థానాలు స్థానాల్లో తొలివిడతగా కొన్ని స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ నేతలు ఢిల్లీ చేరుకున్నారు.

మరి కాసేపట్లో నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా ఆధ్వర్యంలో సెట్టింగ్ స్థానాలతో కలిపి ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ నేతలతో తెలంగాణ బిజెపి నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి , డీకే అరుణ భేటీ కానున్నారు.

ఆశావాహుల్లో ఉత్కంఠ : 

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి టికెట్ ఆశించిన నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. తెలంగాణ నేతలు జాతీయ నాయకులతో పార్లమెంటు టికెట్లపై గురువారం చర్చించనున్నారు. ఈ విషయంపై ఎవరికి టికెట్ వస్తుందో..? ఎవరికి రాదో..? అని ఆందోళనలో పలువురు నేతలు ఉన్నారు. దాంతో ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొన్నది.

తొలి జాబితాలో వీరే ..?

 

  • కరీంనగర్ నుంచి బండి సంజయ్
  • సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.
  • మల్కాజ్గిరి స్థానం నుంచి ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తుంది.
  • చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి.
  • భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్
  • నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ రాములు.
  • మెదక్ ఎంపీ స్థానంలో రఘునందన్ రావు.

మొదటి జాబితాలో పేర్లు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు