తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అందుకున్న…!

గుండు శివ కుమార్ లీఫ్ ఆర్టిస్ట్ 20 నెలల(ఒక సంత్సరం 8 నెలలు) కాలంలో 1000 రావి ఆకులపైన వినూత్నంగా సందర్భమును బట్టి చిత్రాలను వేసినందుకు గాను గుర్తించి తాజాగా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించింది. ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే కార్యాలయంలో పి.సంజీవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును అందుకున్న…!

– లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్

కంగ్టి, మన సాక్షి :

గుండు శివ కుమార్ లీఫ్ ఆర్టిస్ట్ 20 నెలల(ఒక సంత్సరం 8 నెలలు) కాలంలో 1000 రావి ఆకులపైన వినూత్నంగా సందర్భమును బట్టి చిత్రాలను వేసినందుకు గాను గుర్తించి తాజాగా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించింది. ఆదివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే కార్యాలయంలో పి.సంజీవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ALSO READ : పాపం పసిబాలుడు.. సెకన్ల వ్యవధిలో తల్లి ఒడి నుంచి మృత్యు ఒడిలోకి..!

నేను చేస్తున్న లీఫ్ ఆర్ట్ గురించి ఎమ్మెల్యే సంజీవరెడ్డి వివరించడం జరిగింది. దానికీ గాను ఈ రికార్డ్ లభించిందని తెలియజేసాను. అనంతరం తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ సర్టిఫికెట్, మేమొంటో, మెడల్ , బ్యాడ్జిలను ఎమ్మెల్యే సంజీవ రెడ్డి చేతుల మీదుగా శివ కుమార్ కి అందజేసారు.

ఖెడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు మరిన్ని సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనీ మన పట్టణానికి మంచి పేరు తీసుకురావాలి అని అభినందించారు. ఈ కార్యక్రమంలో శంకర్, పరమేశ్వర్ , రమేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు .

ALSO READ : మిర్యాలగూడ : రైలు పట్టాలపై యువతి, యువకుడు ఆత్మహత్య.. ప్రేమ జంటగా అనుమానం..!