తెలంగాణ : కార్మికులతోనే అల్పాహారం, భోజనం.. ఆ ఎమ్మెల్యే ప్రత్యేకత ఏంటి..?
తెలంగాణ : కార్మికులతోనే అల్పాహారం, భోజనం.. ఆ ఎమ్మెల్యే ప్రత్యేకత ఏంటి..?
మిర్యాలగూడ, మన సాక్షి :
ప్రజాసేవ ఆయన లక్ష్యం, నిరంతరం ప్రజల కోసం పాటుపడుతారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరుకున్నారు. అదే స్పూర్తితో అతనిని ఎమ్మెల్యేగా గెలిపించారు. దాంతో ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ప్రజాప్రతినిధిగా పాటుపడుతున్నారు.
ఎమ్మెల్యే అయ్యాక చాలామంది మారిపోతుంటారని అంటారు. ప్రజలను పట్టించుకోరని, అందుబాటులో ఉండరని అంటారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఎమ్మెల్యే అయ్యాక ప్రజలకు మరింత చేరువయ్యారు.. అదే ఆయన ప్రత్యేకత.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి(BLR) నియోజకవర్గంలోని ప్రధాన పట్టణమైన మిర్యాలగూడలో పారిశుధ్యం పై దృష్టి పెట్టారు. ఆయన ప్రతి వాడకు తిరుగుతూ ప్రజల మధ్యలోనే పారిశుధ్య కార్మికులతో కలిసి ఉంటున్నారు.
నేను.. నా.. మిర్యాలగూడ అనే కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వార్డులో మున్సిపల్ కార్మికుల తో పాటు స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, BLR బ్రదర్స్ తో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇప్పటికి ఐదు రోజులుగా మిర్యాలగూడ పట్టణంలో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఐదవ రోజు మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని చేపడుతున్న నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా ఉదయం వినోబా నగర్ పారిశుధ్య కార్మికులతో కలిసి అల్పాహారం చేశారు. తర్వాత వార్డులలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఆయనతోపాటు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
మిర్యాలగూడ : 35 ఏళ్లగా నడుస్తున్న దారిని మూసేశారు.. దారిలో ముళ్ల కంపలు, చుట్టూపంట పొలాలు..!
ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!
NALGONDA: నల్గొండ పోలీసుల స్పెషల్ డ్రైవ్..14 టీములతో నాకబంది..!










