తెలంగాణలో మళ్లీ బి ఆర్ ఎస్ ప్రభుత్వమే

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్.

తెలంగాణలో మళ్లీ బి ఆర్ ఎస్ ప్రభుత్వమే

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్.

చింతపల్లి, మన సాక్షి

ప్రజా సంక్షేమ ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తూ దేశ చరిత్ర లో నిలిచిందని బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండల పరిధిలోని కురుమేడు గ్రామానికి చెందిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాటకొండ నరేంద్ర ప్రసాద్ స్థానిక సర్పంచ్ రుద్రమదేవి టిడిపి పార్టీకి రాజీనామా చేసి బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు రామవత్ రవీంద్ర కుమార్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ తో పాటు ఎనిమిది మంది వార్డ్ సభ్యులు పాలక వర్గం పూర్తిగా బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీ లను ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని ప్రజా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి బడుగు బలహీన వర్గాలకు ఎంతో న్యాయం చేకూరుస్తుందన్నారు.

 

దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ అభివృద్ధిపై ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి కార్యక్రమాల కు ఆకర్షితులై వివిధ గ్రామాల సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీలో చేరడం.జరుగుతుంది అన్నారు.

 

రేపు రాబోయేది కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే వారు ఆశాభావంతో చేశారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేకూరుస్తుంది అన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుస్తుందని వారు వ్యాఖ్యానించారు.

 

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి కుర్మేడ్ సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి ప్రసాద్ ఉప సర్పంచ్ పెంట మల్ల జంగయ్య తో పాటు మరో ఎనిమిది మంది వార్డు సభ్యులు జిల్లా నాయకులు అండే కార్ అశోక్, అండే కార్ వెంకటేష్ స్థానిక ఎంపిటిసి కుంభం శ్వేతా శ్రీశైలం గౌడ్. మాజీ సర్పంచ్ నాదిరి రమేష్. జిల్లా మైనార్టీ సంఘ నాయకులు ఎస్.కె చాంద్ పాషా గ్రామ శాఖ అధ్యక్షులు చిక్కొండ పెద్దిరాజు జిల్లా నాయకులు కానుగుల ఆనంద్, గోరేటి మహేష్, యాదగిరి, వెంకటరమణ ,జంగయ్య ,జిల్లా నాయకులు నాదిరి శ్రీశైలం, వీరితో పాటు పలు గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.